Missing the IPL a blessing in disguise for me: Marnus Labuschagne
#Ipl2021
#DavidWarner
#MarnusLabuschagne

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడే అవకాశం రాకపోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ అన్నాడు. ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత విమాన సర్వీసులపై నిషేధం విధించింది. దాంతో ఆందోళనకు గురైన ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆడమ్ జంపా, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్ లీగ్ నుంచి తప్పుకున్నారు. దీనిపై తాజాగా స్పందించిన లబుషేన్ .. తాను ఈ సీజన్ లో ఆడకపోవడమే తన అదృష్టమని చెప్పాడు.